డోర్నకల్ నియోజకవర్గం దంతాలపల్లి మండలంలోని పడమటిగూడెంలో శ్రీబాలాజీ కాటన్ మిల్ లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ప్రారంభించారు. రైతులు తెచ్చిన పత్తిలో తేమ శాతాన్ని పరిశీలించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు, పత్తిలో తేమ శాతం బట్టి ధరలు నిర్ణయిస్తారని తెలిపారు. సీసీఐ అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.