గొర్లవీడులో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు

81பார்த்தது
గొర్లవీడులో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు
భూపాలపల్లి రూరల్ మండలంలోని గొర్లవీడు గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. రామాలయం శివాలయం, మల్లికార్జున ఆలయం, వాసవి మాత ఆలయంతో పాటు వివిధ వాడలలో వెలసిన గణపతి మండపాల్లో అన్నదాన కార్యక్రమంతో పాటు నిత్య పూజలు భజనలు చేస్తూ ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరాజిల్లాలని, పాడిపంటలు బాగుండాలని గణపతి మండప నిర్వాహకులు ఆ గణనాథుని వేడుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி