భూపాలపల్లి: కాళేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు

73பார்த்தது
భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర కార్తీకమాసం ఆదివారం పొరుగున ఉన్న మహరాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు కాళేశ్వరం చేరుకొని పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, దీపాలు వదిలారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి మారేడు దళాలు సమర్పించి, అభిషేకాలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி