భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రంకాళేశ్వర క్షేత్రంలో ఈ నెల 25 నుంచి 3 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. 25న గణపతి పూజతో ఉత్సవం ప్రారంభం అవుతుందని, 26న సాయంకాలం 4.35 గంటలకు శుభానంద ముక్తీశ్వర కల్యాణం, రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ, 27న ఆదిముక్తీశ్వరాలయంలో స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.