వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, రైతు కమిషన్ రాష్ట్ర నాయకులు కోదండ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పర్యటించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిపాదనలను వివరించారు. KTR ఆధ్వర్యంలో కొందరు అధికారులపై దాడులు చేశారని, మీ ఇష్టప్రకారమే భూసకరణ చేస్తామని, రైతులెవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.