వికారాబాద్ జిల్లా తాండూర్ లో ఈ నెల 19, 20 తేదీల్లో జరుగనున్న సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బుస్స చంద్రయ్య కోరారు. ఈ మేరకు గురువారం దుద్యాలలో మహాసభలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లయ్య, సాయిలు, పెంటప్ప తదితరులు పాల్గొన్నారు.