వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా రైతులను పరామర్శించడానికి మహబూబ్ నగర్ జిల్లా ఎంపీతో పాటు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ వస్తున్న నేపథ్యంలో లగచర్ల గ్రామాల సరిహద్దుల చుట్టూ పోలీసులు పెద్ద ఎత్తున సోమవారం మోహరించారు. వీరితోపాటు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.