రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు.. అభినందించిన నేతలు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీ డిప్లొమా అర్హత పరీక్షలో మహమ్మదాబాద్ మండలంలోని దేశాయిపల్లికి చెందిన విద్యార్థి డి. వేణు 92 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య, ఉమ్మడి పాలమూరు జిల్లా యాదవ మహాసభ ఉపాధ్యక్షుడు బస్వరాజ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేఎం నారాయణ విద్యార్థిని ఘనంగా సన్మానించి, అభినందించారు.