ప్రజలకు అవసరమైన అభివృద్ధిని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం ఆదర్శనగర్లో డీఎంఎఫ్టీ ద్వారా రూ. 5 లక్షలతో నిర్మిస్తున్న సీసీ డ్రైన్ పనులను బాల్రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి, సోమశేఖర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు.