తమిళనాడు కోయంబత్తూరులోని కలంగల్ జంక్షన్ వద్ద స్కూల్ కు వెళ్తున్న ఓ బాలికను ట్రక్కు ఢీ కొట్టకుండా పోలీస్ అధికారి క్షణాల్లో కాపాడారు. బాలిక ఒక్కసారిగా రోడ్డు దాటుతుండగా ట్రక్కు డ్రైవర్ గమనింకుండా ఆమెను ట్రక్కు ఢీ కొట్టబోతుంటే అక్కడే ఉన్న కానిస్టేబుల్ సెల్వ గణేశ్ బాలికను పక్కకి లాగి క్షేమంగా కాపాడారు. ఈ వీడియో సీసీటీవీలో రికార్డు కావడంతో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.