రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ మూడో విడత సాయం సోమవారం జమ కానుంది. బిహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బటన్ నొక్కి డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 19వ విడతగా రూ.22 వేల కోట్లను రిలీజ్ చేయనున్నారు. పీఎం కిసాన్ కింద అర్హులైన రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.6 వేల చొప్పున జమ చేస్తోంది. కాగా, 18వ విడతలో ఏపీలో 41,22,499, తెలంగాణలో 30,77,426 మంది రైతులు లబ్ధి పొందారు.