భర్త నాలుకను కొరికేసిన భార్య.. చివరికి

63பார்த்தது
భర్త నాలుకను కొరికేసిన భార్య.. చివరికి
రాజస్థాన్ రాష్ట్రం ఝలావర్ జిల్లా బకానీ పట్టణంలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. భర్త నాలుకను భార్య కొరికేసింది. కన్హయ్యలాల్ సైన్(25)కు రవీనా సైన్‌తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. పెళ్లై‌నప్పటి నుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. గురువారం రాత్రి కూడా గొడవ పడగా రవీనా భర్త నాలుకను గట్టిగా కొరికేసింది. ఆపై గదిలోకి వెళ్లి తన చేతిని కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

தொடர்புடைய செய்தி