మహారాష్ట్రలోని థానేలో అమానుష ఘటన చోటుచేసుకుంది. భర్తకు తోడుగా నిలవాల్సిన భార్య.. సభ్య సమాజం తలదించుకునే పని చేసింది. భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. అయితే భార్య.. భర్త చనిపోతుంటే అడ్డుకోకపోగా దానిని వీడియో తీసింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపి ఆ మహిళను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.