అరేబియా సముద్రంలో కూలిన రెస్క్యూ కోసం వెళ్లిన హెలికాఫ్టర్‌.. ముగ్గురు గల్లంతు

76பார்த்தது
అరేబియా సముద్రంలో కూలిన రెస్క్యూ కోసం వెళ్లిన హెలికాఫ్టర్‌.. ముగ్గురు గల్లంతు
గుజరాత్‌లోని పోరుబందర్‌ తీరం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అరేబియా సముద్రంలో ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌కు చెందిన అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌(ALH) కూలిపోయింది. పోరుబందర్ సమీప తీరంలోని ట్యాంకర్ లో గాయపడిన సిబ్బందిని రక్షించేందుకు వెళ్తుండగా అత్యవసరంగా ల్యాండింగ్‌ చేస్తున్న సమయంలో సముద్రంలో హెలికాప్టర్‌ కూలడంతో.. కోస్ట్‌ గార్డ్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు.

தொடர்புடைய செய்தி