ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు సన్‌రూఫ్‌పై నిలబడి టపాసులు పేల్చడంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సహరన్పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఒక వివాహ వేడుకలో ప్రజలు టపాసులు పేల్చుతున్నారు. అయితే ఓ వ్యక్తి పెళ్లి కారు రూఫ్‌పై నిలబడి గాల్లోకి టపాసులు కాల్చాడు. అయితే ప్రమాదవశాత్తు నిప్పు రవ్వలు కారులో పడడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.