యూపీలోని సెక్టార్ గామా 1లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఎడమ కంటిలో నీరు కారుతుందని యుధిష్ఠిర్ (7) అనే బాలుడిని.. తల్లిదండ్రులు ఆనంద్ స్పెక్ట్రమ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, టెస్ట్స్ చేసి కంటిలో ప్లాస్టిక్ ఉందని..ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పాడు. దీనికి రూ.45 వేలు ఖర్చు అవుతుందన్నారు. దీంతో యుధిష్ఠిర్‌కు ఆపరేషన్ జరిపారు. అయితే ఎడమ కంటికి చేయాల్సిన ఆపరేషన్ కుడి కంటికి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.