హైదరాబాద్‌లోని కాటేదాన్‌లోని ఉమాని ఫుడ్స్ ఇంటర్నేషనల్ మానిఫ్యాక్చరింగ్ కంపెనీలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. అపరిశుభ్రమైన పరిసరాల్లో తయారు చేస్తున్న 400 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను సీజ్ చేశారు. 50 కిలోల సింథటిక్ ఫుడ్ కలర్ దొరికినట్లు వెల్లడించారు. శాంపిల్స్‌ను టెస్టుల కోసం లాబొరేటరీకి పంపినట్లు అధికారులు తెలిపారు.