సూర్యాపేట జిల్లాలో సదర్ సమ్మేళన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) పి. రాంబాబు అన్నారు. గురువారం ఐడిఓసి సమావేశ మందిరం నందు జిల్లాలోని యాదవ కులస్తుల ప్రముఖుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంక్షేమ బోర్డు సభ్యులు చేవిటి వెంకన్న, డా. రామ్మూర్తి, సిహెచ్ వెంకన్న యాదవ్ ఉన్నారు.