నవంబర్ 29 వ తేదీన సూర్యాపేట లో జరగనున్న జిల్లా స్థాయి దీక్షా దివస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోదాడ మాజీ శాసనసభ్యులు, బి ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళ వారం సూర్యాపేటలో జరిగిన భారత రాష్ట్ర సమితి జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం కేసీఆర్ చేసిన ఉద్యమం నేపద్యం వివరించారు.