విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నవంబరు 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని విజిలెన్స్ సీఐ డి. లింగయ్య అన్నారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ కళాశాలలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాల నిర్వహణలో భాగంగా మారథాన్ కార్యక్రమన్ని నిర్వహించారు. సమగ్రత, అవినీతి నిర్మూలన, లంచం ఇవ్వచూపడం, తీసుకోవడం నేరం వంటి అంశాలపై నవంబరు 3 వరకు అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు.