నాగార్జునసాగర్ రిజర్వాయర్ కు వరద పోటెత్తింది. గత కొద్ది రోజులుగా కృష్ణా నది ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ఆ నీటిని కిందికి వదులుతుండటంతో క్రమంగా సాగర్ కు నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు 16 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్ కు 1,78,983 క్యూసెక్కుల నీటి ఇన్ అండ్ అవుట్ ఫ్లో ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 312 అడుగులు ఉంది. వరద ప్రవాహాన్ని బట్టి మరిన్ని గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలియజేశారు.