కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం అంగుళం సుద్ద ముక్క పై శివలింగం, త్రిశూలం చెక్కి తన కళాత్మకతను చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువుల పై పలు కళారూపాలను ఆవిష్కరించి అవార్డులను పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మ కళలో రాణించి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెస్తానని చారి పేర్కొన్నాడు.