తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో కోదాడకు చెందిన షేక్ షఫీ రాష్ట్ర స్థాయిలో 75వ ర్యాంకు గణిత శాస్త్రం అధ్యాపకునిగా ఉద్యోగం సాధించాడు. ఆయన ప్రస్తుతం నాగర్ కర్నూల్ తెలంగాణ రెసిడెన్షియల్ మైనారిటీ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. పేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన షఫీ కష్టపడి చదివి లెక్చరర్ ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా షఫీని పలువురు అభినందించారు.