మునగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రోడ్డుపై ఉన్న సన్న కంకరను తొలగించడంలో ఎన్ హెచ్ఎఐతో పాటు, జిఎంఆర్ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామాజిక సేవ కార్యకర్త గంధం సైదులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హాస్పిటల్ ఎదురుగా కోదాడ వైపు వెళ్లే రోడ్డుపై స్టాపర్స్ దగ్గర కంకర కుప్పలు ఉండటంతో వాహనాలు ప్రమాదాల గురవుతున్నాయన్నారు.