ఆర్టీసీ బస్సుల అద్దె చార్జీలను తగ్గించినట్టు కోదాడ డిపో మేనేజర్ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు. పల్లె వెలుగు కిలోమీటర్లకు రూ.11, ఎక్స్ ప్రెస్ రూ.7, డీలక్స్ రూ.8, సూపర్ లగ్జరీ రూ.6 మేర తగ్గించినట్లు తెలిపారు. శబరిమలకు, శుభ ముహూర్తాలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకొని క్షేమంగా గమ్యాలకు చేరుకోవాలన్నారు. ప్రయాణీకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.