రోడ్డు పక్కన డబ్బా కొట్లు పెట్టుకొని జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులను ఖాళీ చేయాలంటూ మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ బషీర్ అన్నారు. శుక్రవారం కోదాడలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. సమస్యను మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దృష్టికి తీసుకువెళ్లి చిరు వ్యాపారులకు నష్టం జరగకుండా చూస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ షేక్ షమీ, మజాహర్ ఉన్నారు.