ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఈ ఎఫ్ సభ్యులు ఐక్యంగా ఉద్యమించాలని ఎంఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు మాదిగ అన్నారు. శుక్రవారం కోదాడలో నిర్వహించిన ఎంఈఎఫ్ డివిజన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చేకూరి రమేష్, నాయకులు బొల్లికొండ కోటయ్య, మాగి గురవయ్య, ఏపూరి పర్వతాలు, పాతకోట్ల ప్రకాష్, డా. నెమ్మాది ఉపేందర్, పెడమర్తి సైదులు, నందిగామ రామారావు ఉన్నారు.