ప్రభుత్వం క్రీడారంగ అభివృద్దికి కృషి చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. సోమవారం నడిగూడెం సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో జోనల్ మీట్ ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు విద్య తో పాటు క్రీడల్లో రాణించి జిల్లా కు, రాష్ట్రానికి పేరు తేవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి ఎమ్మెల్యే కు స్వాగతం పలికారు.