సూర్యాపేటలో ఈనెల 29న జరిగే సీపీఎం భారీ బహిరంగ సభకు హమాలి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సీపీఎం నడి గూడెం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రచారంలో భాగంగా హమాలి కార్మికులతో మాట్లాడారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు లతీఫ్ బాబు, సీఐటీయు మండల కన్వీనర్ మల్లెల ఎంకన్న, బీరవెల్లి సుధాకర్ రెడ్డి, ఎల్లయ్య, పాండు, సురేష్, గురవయ్య, శేఖర్, నాగరాజు ఉన్నారు.