కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా పెన్సిల్ మెనపై 10 మిల్లీమీటర్ల ఎత్తు గల శివలింగాన్ని చెక్కి తన కళాత్మకతను చాటుకున్నాడు. సైదులు గతంలో సూక్ష్మ వస్తువులపై పలు కళారూపాలను ఆవిష్కరించి అవార్డులను పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మకళలో రాణించి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెస్తానని సైదులు పేర్కొన్నాడు.