అన్నదానాలు ఆధ్యాత్మికతకు ప్రతీకలని కోదాడ పట్టణ న్యాయవాది గాలి శ్రీనివాస్ నాయుడు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డు లో గాలి రమేష్ నాయుడు అన్నదాన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. గత 11 సంవత్సరాలుగా అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలు ఓరుగంటి రాంప్రసాద్, మాధవి దంపతులు, నిర్వాహకులు పాల్గొన్నారు.