కోదాడలో బుధవారం సాయంత్రం వరకు పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసాయి. ఇటీవల కాలంలో పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడం, సాయంత్రం వేళల్లో గాలి దుమారంతో వర్షం పడటం సర్వ సాధరణంగా మారింది. కాగా బతుకమ్మ ఆట పాటలకు చిరు జల్లులు ఆటంకంగా మారుతున్నాయని మహిళలు వాపోతున్నారు.