హుజూర్ నగర్ పట్టణంలో రామస్వామి గుట్ట వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇండ్లన్నీ నిలిచిపోయాయన్నారు. త్వరలో పూర్తిచేసి అర్హులైన ప్రజలందరికీ ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు.