హుజుర్ నగర్ పట్టణంలోని ఓ హస్పటల్ లో చికిత్స పొందుతున్న మహిళ కు డెలివరి నిమ్మితం సోమవారం ఓ పాజిటివ్ రక్తం అత్యవసరం అయింది. కాగా జనచైతన్య ట్రస్ట్ సభ్యులు వెంటనే స్పందించి ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ డోనర్ కొడిమేల లక్ష్మణ్ తో మాట్లాడి రక్తదానం చేయించారు. ఈ సందర్బంగా ట్రస్ట్ అధ్యక్షుడు పారా సాయి మాట్లాడుతూ ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం ఉంటే రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.