హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో శనివారం మార్కెట్ యార్డు వద్ద సీతారాంనగర్ కు చెందిన ఓ వృద్ధుడి పై కుక్క దాడి చేసి గాయపరిచింది. మార్కెట్ యార్డ్ వైపు నుండి మిర్యాలగూడ రోడ్డుకు వస్తుండగా ఆ వ్యక్తి పై కుక్క ఒక్కసారిగా దాడిచేసి కరిచి గాయపర్చింది. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడద పెరిగి పోతుందని మునిసిపల్ అధికారులు కుక్కల బెడద నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.