సూర్యాపేటలో ఈ నెల 29న జరిగే సిపిఎం జిల్లా తృతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీలం శ్రీను అన్నారు. ఆదివారం హుజూర్నగర్లో జరిగిన ఇంటింటి ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో జరిగే ప్రతినిధుల మహాసభలు విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తురక వీరయ్య, వెంకన్న, ఇంటి తిరుపతయ్య, చింతకాయల ఎంకన్న, బత్తిని అక్కమ్మ, సేలం సావిత్రి, కాలంగి మిన్నమ్మ, సుభద్ర ఉన్నారు.