దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పండుగ రోజు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లతో మార్కెట్లు లాభపడ్డాయి. దీంతో సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో 76,499.63 వద్ద ముగియగా నిఫ్టీ 23,176 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.64 వద్ద స్థిరపడింది.