దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)-IV’ కింద మరిన్ని నిబంధనలను అమలు చేయనున్నారు. ఢిల్లీలోకి ట్రక్కుల ప్రవేశాన్ని నిషేధించడంతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణాలనూ తాత్కాలికంగా నిలిపివేయాలని CAQM సూచించింది. ఎలక్ట్రిక్, సీఎన్జీ, బీఎస్-4 వాహనాలు మినహా ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్‌తో ఉన్న తేలికపాటి కమర్షియల్ వెహికల్స్ ప్రవేశంపై నిషేధం విధించింది.