డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో తెలుగమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక భారత్ తరపున నంబర్‌వన్‌గా నిలిచింది. సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో శ్రీవల్లి 302వ స్థానం సాధించింది. మరో తెలుగమ్మాయి సహజ యమలపల్లి 304వ ర్యాంకుతో శ్రీవల్లి తర్వాత భారత్ తరపున మెరుగైన స్థానంలో నిలిచింది. అంకిత రైనా (306), వైదేహి చౌదరి (405) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.