రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో 15 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న రైటర్స్ కి ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం సర్టిఫికెట్స్ అందజేశారు. నేర ఛేదనలో సాక్ష్యాధారాలు సేకరించడం, కేసుల విచారణ నివేదికలను పటిష్ఠంగా రూపొందించడం వల్ల నేర నిరూపణ జరిగి నిందితులకు శిక్షలు పడే విధంగా చేయవచ్చని, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్టేషన్ రైటర్స్ నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటు విధులు నిర్వర్తించాలన్నారు.