జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మంగళవారం మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 1531 ఈబీ బ్లాక్ లలో 1 లక్షా 92 వేల 432 ఇండ్లలో సర్వే చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు మొత్తం 49 వేల 918 ఇండ్లలో (26 శాతం) సర్వే పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. గంభీర్ రావు పేట, ముస్తాబాద్ , ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి మండలాల్లో సర్వే నిర్వహణలో వేగం పెంచాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.