ఈనెల 27న కరీంనగర్ నుండి వేములవాడ వరకు నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారులు ఫోరం రాష్ట్ర కన్వీనర్, జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య యాదవ్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. 27 న కరీంనగర్ అమరవీరుల స్థూపం వద్ద ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.