సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధికి సంస్థ కట్టుబడి ఉందని రామగుండం- 3 జీఎం సుధాకర్ రావు అన్నారు. సోమవారం కమాన్ పూర్ మండలం ముల్కలపల్లి, జూలపల్లి గ్రామాల్లో అభివృద్ధి పనులకు జీఎం భూమిపూజ చేశారు. గ్రామాల్లో వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు- 1 ప్రాజెక్టు అధికారి రాజశేఖర్, సంఘాల నాయకులు పాల్గొన్నారు.