జిల్లాలోని ప్రజలకు కేంద్ర ప్రాయోధిత పథకాల ద్వారా అధికంగా లాభం కలిగే విధంగా అధికారులు పని చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణులతో కలిసి జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ- దిశ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పాల్గొన్నారు.