రామగిరి: విద్యాభివృద్ధికి స్టడీ కార్నర్
విద్యార్థి అభివృద్ధికి స్టడీ కార్నర్ ఎంతో దోహదం చేస్తుందని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. శనివారం రామగిరి మండలంలోని బేగంపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న మల్క రాంకిషన్ రావు తన మిత్రులు తులసీరావు, డా. రవితేజ, శ్యాంల సహకారంతో పదో తరగతిలోని 23 మంది విద్యార్థులకు ఒక్కోక్కరికి రూ. 2200 చొప్పున మొత్తం రూ. 50, 800 విలువ గల స్టడీ కార్నర్ కొనుగోలు చేసి పాఠశాల ఆవరణలో అందజేశారు.