ముత్తారం మండలంలోని దర్యాపూర్ మోడల్ స్కూల్లో శనివారం 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని 010 సాధన సమితి ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్ధు ద్వారా వేతనాలు చెల్లించే వారికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నిరసనలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, శాంతి, చైతన్య, అశోక్, సునీత, స్వర్ణలత, నిర్మలలు పాల్గొన్నారు.