హుస్నాబాద్: పాఠ్యాంశాలతో పాటు ఇన్నోవేటివ్ అంశాలపై దృష్టి సారించాలి
హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరులో మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుండి మానకొండూరు కార్యక్రమానికి వెళ్తుండగా మార్గమధ్యలో విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ బాగా చదువుకోవాలని మంచి ప్రయోజకులు కావాలని సూచించారు. పాఠశాలలో గేమ్స్ జరుగుతున్నాయా అని, పాఠ్యాంశాలతో పాటు ఇన్నోవేటివ్ అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.