జగిత్యాల: ప్రజావాణికి 31 దరఖాస్తులు
జగిత్యాల జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుండి 31 ఫిర్యాదులు, వినతులను కలెక్టర్ బి సత్య ప్రసాద్ స్వయంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి, ఆర్డీఓలు మధు సుధన్, శ్రీనివాస్, కలెక్టరేట్ ఏ. ఓ. హన్మంత రావు, వివిధ జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.