జగిత్యాల: రేపు యథావిధిగా ప్రజావాణి
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రేపటి నుంచి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ కి వచ్చి ఫిర్యాదులు సమర్పించాలనుకొనే ఫిర్యాదుదారులు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు సమర్పించవచ్చని కలెక్టర్ అట్టి ప్రకటనలో వెల్లడించారు.