జగిత్యాల పట్టణంలోని సామంతుల భోజనశాలలో బుధవారం భోజనం చేసేందుకు వెళ్లిన ఒక కస్టమర్ అన్నంలో స్టీల్ స్ప్రింగ్‌ను చూసి షాకయ్యాడు. వెంటనే హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం కామన్ అంటూ హోటల్ యజమాని చెప్పడంతో మండిపడ్డారు. అంతేకాకుండా ఏం చేస్తావో చేసుకో అంటూ దురుసుగా వ్యవహరించారని కస్టమర్ ఆరోపించారు.